జూనియర్ కొడుకు కలియుగ కృష్ణుడా !
జూనియర్ కొడుకు కలియుగ కృష్ణుడా !
 
    
    
   
నిన్న
 ఉదయం జూనియర్ ఎన్టీఆర్ కు వారసుడుగా పుట్టిన బుడ్డోడు పుట్టి ఒకరోజు కూడ 
కాకుండానే మీడియా వార్తలకు ఎక్కాడు. దీనికి కారణం ఈ బుడ్డోడు శ్రీకృష్ణుడు 
పుట్టిన రోహిణి నక్షత్రంలో పుట్టడం. ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఇతరులను 
ఆకర్షిస్తూ అందంగా ఉంటూ ఆజానుబాహుడై అందమైన కళ్ళు,
 విశాలమైన భుజాలు కలిగి 
ఉంటారని జ్యోతిష్య శాస్త్ర వేత్తలు చెపుతూ ఉంటారు. 
ఈ నక్షత్ర ఫలితాన్ని తెలుసుకున్న యంగ్ టైగర్ అభిమానులు మటుకు తమ హీరోకు మరో
 టాప్ హీరో పుట్టాడు అని ఆనందంలో మునిగి తేలుతున్నారు. అంతేకాకుండా ఈ 
బుడ్డోడు రాకతో ప్రస్తుతం నందమూరి కుటుంబంలో నేలకున్న విభేదాలు అన్నీ 
తొలగిపోయి జూనియర్ కు ఇక అంతా మంచి రోజులే అంటూ నందమూరి అభిమానులు ఆనంద 
పడుతున్నారు.
 ‘రభస’ సినిమా షూటింగ్ కోసం స్విట్జర్లాండ్ లో సమంతతో రొమాన్స్ చేస్తున్న 
జూనియర్ కు తనకు మరో బుడ్డోడు పుట్టాడు అని తెలియగానే షూటింగ్ ఆపుకుని 
హైదరాబాద్ తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా షూటింగ్ స్పాట్ లో
 ఉన్న సమంత తనకు బుల్లి బుడ్డోడుని త్వరగా చూడాలని ఉంది అంటూ జూనియర్ దగ్గర
 హడావిడి చేసిందని టాక్.
   
