‘రుద్రమదేవి’ ట్రైలర్ వస్తోంది
‘రుద్రమదేవి’ ట్రైలర్ వస్తోంది
అనుష్క
ముఖ్యపాత్రలో తెరకెక్కుతున్న ‘రుద్రమదేవి’ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతో
ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గుణశేఖర్ భారీ బడ్జెట్‌తో కాకతీయుల కాళా
వైభవాన్ని కళ్లకు కట్టినట్లు చూపించేందుకు ఎన్నో అద్భుత సెట్‌లను ఈ చిత్రం
కోసం వేయించాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి
ఇప్పటి వరకు అధికారికంగా కథాపరంగా ఎటువంటి విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త
పడ్డారు. తాజాగా ఈ చిత్రం ట్రైలర్స్‌ను విడుదల చేయాలని
నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.ఆగస్టు 15న ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేయాలనే ఆలోచనతో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆగస్టు 15న రుద్రమదేవి ట్రైలర్ విడుదల ట్రైలర్ సినిమాపై ఆసక్తి పెంచేదిగా ఉండేందుకు దర్శకుడు గుణశేఖర్ ప్రత్యేకంగా దగ్గరుండి మరీ ట్రైలర్‌ను తయారు చేయిస్తున్నట్లు చిత్ర యూనిట్ వర్గాల నుండి సమాచారం అందుతోంది. ఇక ఈ చిత్రంలో అల్లు అర్జున్, రానాలు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న విషయం తెల్సిందే. ఇంకా ఎంతో మంది సీనియర్ నటీనటులు ఈ చిత్రంలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని ఇదే సంవత్సరం చివర్లో విడుదల చేయాలని చిత్ర దర్శక నిర్మాత గుణశేఖర్ భావిస్తున్నాడు.
