పవన్ కు సెల్ టెన్షన్ !
పవన్ కు సెల్ టెన్షన్ !
 
    
    
      
జనసేన
 పార్టీ పెట్టి కాంగ్రెస్ పార్టీ కి ముచ్చెమటలు పట్టించిన పవన్ కళ్యాణ్ కు 
సెల్ టెన్షన్ మొదలు అయ్యింది అంటే ఎవ్వరూ నమ్మరు. పవన్ తో పాటు పవన్ చుట్టు
 పక్కలవారికి కూడ ఈ సెల్ టెన్షన్ పట్టుకుంది. దీనికి కారణం పవన్ ప్రస్తుతం 
నటిస్తున్న ‘గోపాలా గోపాలా’ అని అంటున్నారు. అనేక వాయిదాల తరువాత పవన్ తన 
కృష్ణుడి గెటప్ తో మొన్న సోమవారం నుండి నానకరాంగూడలోని రామానాయుడు 
స్టూడియోలో గోపాలుడి షూటింగ్ లో పాల్గొంటున్నాడు.
 పవన్ కళ్యాణ్ లుక్ బయటకు రాకుండా నిర్మాతలు గట్టి ఏర్పాట్లు చేసి యూనిట్ 
సభ్యులు ఎవరూ మొబైల్ ఫోన్లు వాడకుండా ఆంక్షలు విధించారు. అంతేకాకుండా 
షూటింగ్ లో పాల్గొంటున్న ప్రతి వ్యక్తిని అతి జాగ్రత్తగా చెక్ 
చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఒక పక్కా ప్రణాళికతో పవన్ ‘గోపాలు’ డి 
ఫస్ట్ లుక్ విడుదల
చేయాలని ఈ సినిమా నిర్మాతలు భావిస్తున్నట్లుగా 
తెలుస్తోంది.
 అయితే గతంలో పవన్ ‘అత్తారింటికి దారేది’ సినిమాను ఆ సినిమా ఎడిటింగ్ రూమ్ 
లో పనిచేసే ఒక వ్యక్తి లీక్ చేసిన సంఘటన తరువాత ఇక్కడ కూడ ఎవరైనా తెలియని 
వ్యక్తులు తమ సెల్ ఫాన్స్ ద్వారా తన కృష్ణుడి లుక్ ను బయట పెడతారేమో అన్న 
భయంతో పవన్ కు సెల్ ఫోన్ ను చూసి భయపడుతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. 
ఇది ఇలా ఉండగా పవన్ వెన్ను నొప్పి గురించి రేణు దేశాయ్ మొన్న పెట్టిన 
ట్విట్ తో పవన్ ఆరోగ్యం పై మళ్ళీ గాసిప్స్ ఊపు అందుకున్నాయి. పవన్ 
విదేశాలలో చికిత్స చేయించుకున్నా పవన్ ను వెన్ను నొప్పి ఇంకా పీడిస్తోందని 
కనీసం గంట సేపు విమానంలో ప్రయాణం చేయడానికి పవన్ చాల కష్టపడుతున్నాడనే 
గాసిప్స్ ఫిలింనగర్ లో మళ్ళీ హల్ చల్ చేస్తున్నాయి. ఏమైనా పవన్ ను 
ప్రస్తుతం ఒక వైపు సెల్ ఫోన్ మరొక వైపు వెన్ను నొప్పి భయపెడుతున్నట్లే 
అనుకోవాలి.
   