చరణ్ మరో వ్యాపారం షురూ చేశాడు
చరణ్ మరో వ్యాపారం షురూ చేశాడు
మెగాపవర్‌స్టార్
రామ్‌చరణ్ ఇప్పటికే మాటీవీలో కొంత భాగం వాటాను కలిగి ఉన్న విషయం
తెల్సిందే. హార్స్ రైడింగ్ కోర్టును ప్రారంభించి దాని నుండి మంచి
ఆదాయాన్ని రాబట్టుకుంటున్నాడు. తాజాగా రామ్‌చరణ్ మరో వ్యాపారాన్ని మొదలు
పెట్టాడు. విమానయాన రంగంలోకి చరణ్ ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా భారత కేంద్ర
ప్రభుత్వం చరణ్ విమానయాన సంస్థకు అనుమతులు మంజూరు చేసింది.వంకయలపాటి ఉమేష్‌తో కలిసి, రామ్‌చరణ్ టర్బోమేఘ అనే ఎయిర్‌లైన్స్ కంపెనీని ప్రారంభించాడు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఎనిమిది కొత్త ఎయిర్ లైన్స్ సర్వీసులకు అనుమతిచ్చింది. అందులో ఎయిర్‌లైన్స్ కంపెనీ ప్రారంభించిన రామ్‌చరణ్ రామ్‌చరణ్ టర్బోమేఘ ఎయిర్ లైన్స్ ఒకటి. ఈ విమాన సర్వీస్ ద్వారా దేశంలోని కొన్ని ప్రాంతాలకు విమాన సర్వీసులను నడుపుకోవచ్చు.
సినిమాలతో బిజీగా ఉంటూనే వ్యాపారంలో కూడా దూసుకు పోతున్నాడు రామ్‌చరణ్. ప్రస్తుతం ఈయన ‘గోవిందుడు అందరి వాడేలే’ చిత్రంలో నటిస్తున్నాడు. ఆ తర్వాత శ్రీనువైట్ల దర్శకత్వంలో ఒక చిత్రంలో నటించనున్నట్లు తెలుస్తోంది.
