జూనియర్ కు సవాల్ గా మారుతున్న పవన్ !
జూనియర్ కు సవాల్ గా మారుతున్న పవన్ !
గత
ఏడాది ‘అత్తారింటికి దారేది’ తరువాత సంవత్సరం గడిచిపోయాక కూడ పవన్ ఇంకా
కెమెరా ముందుకు రాలేదు. ఈ నెలాఖరుకు పవన్ ‘గోపాలా గోపాలా’ సెట్స్ పైకి
వస్తాడు అనుకున్నారు అంతా. అయితే ఎపి హెరాల్డ్ కు తెలుస్తున్న సమాచారం
మేరకు పవన్ గోపాలుడు సెట్ మీదకు వచ్చేసరికి మరింత ఆలస్యం అవుతుంది అని
తెలుస్తోంది.
దీనికి కారణం పవన్ తన కృష్ణుడి గెటప్ లో మరికొన్ని మార్పులు ఈ సినిమా
దర్శక నిర్మాతలకు సలహా ఇచ్చాడు అని టాక్. దీనితో ఇప్పటికి కూడ పవన్ సెట్
మీదకి రాని ఈ సినిమాను హడావిడిగా పూర్తి
చేయకుండా క్వాలిటీకి ప్రాధాన్యతను
ఇస్తూ నెమ్మదిగా ఈ సినిమాను పూర్తి చేయాలని ఈ సినిమా యూనిట్ నిర్ణయానికి
వచ్చినట్లు తెలుస్తోంది.
ఈ వార్తలే నిజం అయితే ఈ సినిమా ఈ దీపావళికి కాకుండా వచ్చే సంవత్సరం
సంక్రాంతికి విడుదల అయ్యే అవకాశం ఉంది అని అంటున్నారు. వచ్చే సంవత్సరం
సంక్రాంతికి మహేష్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లకు సంబంధించిన భారీ సినిమాలు
ఏమి లేకపోవడం కూడ గోపాలుడి సినిమా నిర్మాతల ఆలోచనలను ప్రభావితం చేస్తోంది
అని అంటున్నారు.
అయితే పూరి జగన్నాద్, జూనియర్ కాంబినేషన్ లో త్వరలో ప్రారంభం కానున్న
సినిమా వేగంగా పూర్తి చేసి సంక్రాంతికి విడుదల చేస్తారు అనే టాక్ గట్టిగా
ఉంది. ఈ నేపధ్యంలో అన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే వచ్చే
సంక్రాంతికి పవన్ జూనియర్ల మధ్య పోటీకి రంగం సిద్ధం కాబోతోంది అని
అనుకోవాలి. కానీ లేటెస్ట్ గా నిర్మాణం అవుతున్న బాలయ్య ‘గాడ్సే’ కూడ
సంక్రాంతి బరినే ఎంచు కుంటే పరిస్థితి ఏమిటీ అన్నదే ప్రశ్న ..