“అరుంధతి”గా ఐశ్వర్య రాయ్

“అరుంధతి”గా ఐశ్వర్య రాయ్



aishwarya kandireega.com
అనుష్క ప్రధాన పాత్రలో కోడిరామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ “అరుంధతి”. ఈ సినిమాకి ఎం. శ్యాం ప్రసాద్ రెడ్డి నిర్మాత. అనుష్క నటించిన మొట్ట మొదటి లేడీ ఓరియెంటెడ్ మూవీ ఇది. ఈ సినిమా బాక్స్ ఆఫీసు దగ్గర వసూలు కలెక్ట్ చేయడమే కాకుండా ఇటు టాలీవుడ్ లో అటు కోలీవుడ్ లో అనుష్కకి నంబర్ వన్ స్టార్డంని తెచ్చిపెట్టింది.
ఇంత పెద్ద హిట్ అయిన “అరుంధతి” మూవీని దర్శకుడు కోడిరామకృష్ణ హిందీలో తెరకెక్కించాలన్న ఆలోచనలో ఉన్నారట. ఈ సినిమాలో అనుష్క పాత్రలో మాజీ ప్రపంచసుందరి ఐశ్వర్య రాయ్ నటించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా పట్ల ఐశ్వర్య ఆసక్తిహిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు చూపిందని దర్శకుడు కోడిరామకృష్ణ మీడియాకు వెల్లడించాడు.
ఐశ్వర్య రాయ్ కి దర్శకుడు కోడిరామకృష్ణ మూడు కథలు వినిపించాడట. కాని ఐష్ మాత్రం “అరుంధతి” కథకు ఇంప్రెస్ అయిందని తెలుస్తోంది.
అయితే, “అరుంధతి” డబ్బింగ్ వెర్షన్ హిందీలో విడుదల కావడంతో దర్శకుడు కోడిరామకృష్ణ కొత్త కథతో సినిమా తెరకెక్కించాలని భావిస్తునట్టు సమాచారం.

Popular Posts