ఎన్టీఆర్‌ కొడుకు పేరు?

ఎన్టీఆర్‌ కొడుకు పేరు?


Jr.NTR with Wife Pranathi at Dammu Audio Launch Stillsయంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ తాజాగా తండ్రైన విషయం తెల్సిందే. లక్ష్మీ ప్రణతి రెయిన్‌బో హాస్పిటల్‌లో బాబుకు జన్మచ్చింది. కొడుకు పుట్టడంతో ఎన్టీఆర్‌ చాలా సంతోషంగా ఉన్నాడు. నందమూరి వంశంలోకి మరో వారసుడు రావడంతో నందమూరి అభిమానుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఇక బుల్లి యంగ్‌టైగర్‌కు పేరు పెట్టే విషయంలో ఎన్టీఆర్‌ అప్పుడే కసరత్తులు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. బుల్లి యంగ్‌టైర్‌ పేరు కూడా ఎన్టీఆర్‌
తాత పేరును పెట్టుకున్న ఎన్టీఆర్‌ తన కొడుకుకు కూడా తాత పేరునే పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. నందమూరి తారక రామారావు అని ఎన్టీఆర్‌ తన కొడుకుకు పెట్టాలనే ఆలోచన చేస్తున్నాడంటూ ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. మరి కొన్ని పేర్లను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే నందమూరి బుల్లి యంగ్‌ టైగర్‌ పేరును ఖరారు చేసే అవకాశముందని తెలుస్తోంది.